ఊడికలపేటలో క్షుద్ర పూజల కలకలం
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:56 PM
పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేట గ్రామంలో క్షుద్ర పుజల కలకలం రేగింది.
డెంకాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పెదతాడివాడ పంచాయతీ ఊడికలపేట గ్రామంలో క్షుద్ర పుజల కలకలం రేగింది. దీనిపై డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊడికలపేట గ్రామానికి చెందిన పి.పైడయ్య కుటుంబీకులు సోమవారం ఉదయం లేచి బయటకు వచ్చి చూసేసరికి ఇంటి గుమ్మం ముందు మనిషి పుర్రె పూజలు చేసి ఉన్నట్టు కనిపించింది. దీంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి, పరిశీలించారు. పుర్రెను అక్కడ నుంచి తొలగించి, కల్చివేశారు. దీనిపై ఎస్‌ఐ మాట్లాడుతూ ఇది ఆకతాయిల పని అని, విచారణ జరిపి, పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు.