Share News

MTS ఇక ఎంటీఎస్‌ల వంతు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:24 PM

Now It's the Turn of MTS ఉమ్మడి జిల్లాలో ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యా డైరెక్టర్‌ విజయ రామరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

 MTS  ఇక ఎంటీఎస్‌ల వంతు

సాలూరు రూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యా డైరెక్టర్‌ విజయ రామరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2008, 1998 డీఎస్సీలకు చెందిన 480 మంది ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారి బదిలీల నిమిత్తం ఇప్పటికే ఎంటీఎస్‌ల సీనియార్టి జాబితాను ప్రకటించారు. ఈ బదిలీల్లో తొలుత 2008 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. నిబంధనల మేరకు ఈ నెల 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 34 మండలాల ఎంఈవోలు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు. ఎంటీఎస్‌లకు బదిలీల ప్రక్రియ గురు,శుక్రవారాల్లో చేపట్టే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 18 , 2025 | 11:24 PM