సిబ్బంది చాలక.. సేవలందక
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:31 PM
మండలంలో అదనపు పీహెచ్‌సీ ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కుతోంది. పెరుగుతున్న వైద్య అవస రాలకు అనుగుణంగా మరో పీహెచ్‌సీ ఏర్పాటుచేయాలని స్థానిక ప్రజాప్ర తినిధులు, వైద్యులు ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లున్నా కార్యరూపం దాల్చడంలేదు. ఈ నేపథ్యంలో సిబ్బంది చాలకపోవడంతో పూర్తిస్థాయిలో సేవలందడం లేదు.
గజపతినగరం, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): మండలంలో అదనపు పీహెచ్‌సీ ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కుతోంది. పెరుగుతున్న వైద్య అవస రాలకు అనుగుణంగా మరో పీహెచ్‌సీ ఏర్పాటుచేయాలని స్థానిక ప్రజాప్ర తినిధులు, వైద్యులు ఉన్నతాధికారులు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లున్నా కార్యరూపం దాల్చడంలేదు. ఈ నేపథ్యంలో సిబ్బంది చాలకపోవడంతో పూర్తిస్థాయిలో సేవలందడం లేదు.
మండలంలోని జనాభా ప్రాతిపదికన అదనపు పీహెచ్‌సీ మంజూరుచే యాలని పదేళ్లుగా వైద్యులుచేస్తున్న ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయి. 30 వేల జనాభాకు ఒక పీహెచ్‌సీ అవసరం. కాగా 60 వేలుపైబడి జనాభా ఉన్న మండలంలో ఒకే పీహెచ్‌సీఉంది. 2019లో టీడీపీ హయాంలో జిన్నాంలో అదనపు పీహెచ్‌సీకి ప్రతిపాదనలుచేశారు.ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో అదనపు పీహెచ్‌సీ జిన్నాంలో మంజూరు చేయకుండా గజపతినగరం సీహెచ్‌సీలోనే వైద్యాధికారులకు అదనంగా ఒక గదిని ఏర్పాటుచేశారు.అయితే సీహెచ్‌సీ ఏరియా ఆసుప త్రిగా అప్‌గ్రేడ్ కావడంతో అక్కడ ఉన్న వైద్యసిబ్బందికే వసతి కష్టతరంగా మారింది. దీంతో అక్కడి వైద్యాధికారులను మరుపల్లి పీహెచ్‌సీకే పంపిం చారు. అదనపు పీహెచ్‌సీకీ సంబందించి ఇద్దరు వైద్యులు ఉన్నా నలుగురు సూపర్‌వైజర్లకు రెండుపోస్టులు ఖాళీగాఉన్నాయి. దీంతో మరుపల్లి పీహెచ్ సీ సిబ్బందిపై అదనపు భారంపడుతోంది. మండలంలోని 30 పంచాయ తీలకుగాను మరుపల్లి పీహెచ్‌సీ పరిధిలో నలుగురితో సేవలందించాల్సి వస్తోంది.దీంతో మండలంలోని చుట్టుపక్కలగ్రామస్థులు మరుపల్లి పీహెచ్ సీకేసేవలకు రావల్సిఉండడంతో వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
మండలంలోని 63,579 మంది జనాభాకు మరుపల్లి పీహెచ్‌సీ నుంచే వైద్యసేవలు అందించాల్సివస్తోంది.దీనికితోడు వైద్యులకు అదనంగా 104 సేవలకు రోజుకు ఒకవైద్యాధికారి వెళ్లాల్సిఉంది. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీ పరిధిలో 21 గ్రామసచివాలయాలకు గాను నలుగురు హెల్త్ అసిస్టెంట్లకు గానూ ఒక్కరే ఉన్నారు. ఎంఎల్‌హెచ్‌పీలు మరుపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల అత్యవసర సమయాల్లో వైద్య సేవలందించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి వైద్యాధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని తీసుకువెళ్లారు. దీంతో తమ సమస్యకు పరిష్కారంలభిస్తుందని వైద్యసిబ్బంది ఆశతో ఎదురు చూస్తున్నారు.
మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం
మరుపల్లి పీహెచ్‌సీలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకో వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికృష్ణారెడ్డి తెలిపారు. అదనంగా మంజూరుచేసిన ఏరి యాఆసుపత్రిలో ఇచ్చిన భవనం చాలక మరుపల్లి పీహెచ్‌సీలో నలుగురు వైద్యులు సేవలందించాల్సి వస్తోందని చెప్పారు.దీంతోచుట్టు పక్కల గ్రామా ల నుంచి వచ్చిన రోగులు ఇబ్బందులుపడుతున్నారని తెలి పారు. అదనపు పీహచ్‌సీ భవనం మంజూరు చేయాలని కోరుతున్నామని చెప్పారు.