Share News

Not Chandrababu.. చంద్రబాబు కాదు.. మీరే రద్దు చేశారు

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:46 PM

Not Chandrababu... It Was You Who Cancelled It పార్వతీపురంలో ‘బాబుష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ నాయకులకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది. వైసీపీ నాయకులు తనకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టింది.

Not Chandrababu..  చంద్రబాబు కాదు.. మీరే రద్దు చేశారు
కరపత్రం తీసుకోకుండా మాజీ ఎమ్మెల్యేని నిలదీస్తున్న వృద్ధురాలు

  • చల్లగా జారుకున్న వైసీపీ నాయకులు

పార్వతీపురం, జూలై 21(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో ‘బాబుష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ నాయకులకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది. వైసీపీ నాయకులు తనకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టింది. వైసీపీకి చెందిన పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు, మరికొందరు నాయకులు పార్వతీపురం మున్సిపాలిటీ 18వ వార్డులో సోమవారం ఇంటింటికి వెళ్లారు. ‘బాబుష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కరపత్రాలు పట్టుకుని తిరిగారు. ఓ ఇంటి వద్దకు వెళ్లిన జోగారావు.. వృద్ధురాలికి కరపత్రం ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంటికోసం ఎన్నిసార్లు తిరిగానో గుర్తుందా? అని నిలదీసింది. పక్కనే ఉన్న వైసీపీ శ్రేణులు వారించబోగా మీరు ఊరుకోండంటూ కస్సుమంది. దీనికి జోగారావు అడ్డుతగులుతూ మీకు కేటాయించిన ఇంటిని చంద్రబాబు రద్దు చేశారంటూ చెప్పబోయారు. దీనికి ఆ వృద్ధురాలు ఎదురు తిరుగూ ‘నాకు ఇంటికోసం ఎన్నిసార్లు నీ వద్దకు తిరిగాను. ఓ మనిషిని పంపించావు. ఇల్లు ఇచ్చారా’ అని ప్రశ్నించింది. అప్పట్లో మీరే నా ఇంటిని రద్దు చేసి ఇప్పుడు చంద్రబాబుపైకి నెట్టేస్తారా? అని నిలదీసింది. దీంతో వైసీపీ నాయకులకు నోటమాట రాలేదు. ఇంకా ఆ వృద్ధురాలు తమకు కడిగేస్తుందేమోనని అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:47 PM