ఒక్క పింఛన్ కూడా తొలగించలేదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:18 AM
రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నా రు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ట్రంలో ప్రభుత్వం పింఛన్లు తొలగి స్తున్నట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘15నెలల్లో ఏ ఒక్క పింఛన్ కూడా తొలగించలేదు. 65 లక్షల మందికి పింఛ న్లు అందిస్తున్నాం. గతంలో కొందరు నకిలీ సదరం సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని 80 వేల మందికి నోటీసులు ఇచ్చాం. అర్హులైన వారి పెన్షన్‌లు ఎక్కడైనా తొలగిస్తే, నిరూపించాలి. ప్రతిపక్ష నేతలు లేనిపోని అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు 30రోజుల్లోగా అపీల్ చేసుకోవచ్చు. తిరిగి వారి సర్టిఫికెట్లను వైద్యాధికారులు మరోసారి పరిశీలిస్తారు. అర్హత ఉంటే పింఛన్ పునరుద్ధరిస్తాం. నోటీసులు ఇచ్చినందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ విధం గా ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం తగదు. పింఛన్లు పెంచిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది.’ అని అన్నారు.