Share News

వైసీపీ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:14 AM

మండలంలోని వైసీపీ ఎంపీపీ భోగి గౌరిపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

వైసీపీ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
చేతులు పైకెత్తిన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు, చిత్రంలో ఎమ్మెల్యే బేబీనాయన

- పదవిని కోల్పోయిన గౌరి

- త్వరలో కొత్త వారి ఎన్నిక

బాడంగి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వైసీపీ ఎంపీపీ భోగి గౌరిపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆమె తన పదవిని కోల్పోయారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో రామ్మోహన్‌ సమక్షంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన హాజరయ్యారు. ఎంపీపీ గౌరికి వ్యతిరేకంగా టీడీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు చేతులు పైకెత్తారు. దీంతో అవిశ్వాసంలో ఓడిపోవడంతో గౌరి ఎంపీపీ పదవి కోల్పోయినట్టు ఆర్డీవో ప్రకటించారు. అలాగే వైస్‌ ఎంపీపీ-1 బొమ్మినేని రమేష్‌ కూడా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ఈయనకు వ్యతిరేకంగా 9 మంది ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తడంతో ఆయన పదవి కూడా పోయినట్టు ఆర్డీవో తెలిపారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు 9 మంది ఎంపీటీసీ సభ్యుల విక్టరీ సింబల్‌ చూపిస్తూ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. త్వరలో కొత్త ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్డీవో తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 12:14 AM