Share News

No-confidence motion?: నెల్లిమర్ల చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం?

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:46 AM

No-confidence motion?: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌పై త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

No-confidence motion?: నెల్లిమర్ల చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం?
నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం

- జోరుగా సాగుతున్న ప్రచారం

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌పై త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన ఓ దళిత మహిళ చైర్‌పర్సన్‌గా గతంలో ఎన్నికయ్యారు. అనంతరం జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ పెద్దలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇదే క్రమంలో పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు కోరిన రెండు అంశాలను ఆమోదించకుండా చైర్‌పర్సన్‌ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిల్లో ఆమెను ఎలాగైనా పదవి నుంచి దించేయాలనే ఆలోచనతో ఇటు టీడీపీ, అటు వైసీపీ ఉన్నట్లు సమాచారం. అవిశ్వాసం తీర్మానంతో ఆమెను దించేసి, టీడీపీకి చెందిన మరో కౌన్సిలర్‌ను చైర్‌పర్సన్‌గా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. నెల్లిమర్ల నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏడుగురు టీడీపీ కౌన్సిలర్లు, 9 మంది వైసీపీ, ముగ్గురు జనసేన, ఒక బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీకి వైసీపీ సహకరిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.

Updated Date - Apr 20 , 2025 | 12:46 AM