No Bills! స్టాక్ రికార్డు లేదు.. బిల్లులు లేవు!
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:22 AM
No Stock Records… No Bills! పట్టణంలో చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎరువుల (శ్రీసాయి రైతు డిపో) దుకాణాన్ని సాలూరు, పాలకొండ ఏడీఏలు జి.సత్యవతి, రత్నకుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో లైసెన్స్ ఒకటే ఉన్నట్లు గుర్తించారు.
అమ్మకాలు నిలిపివేయాలని ఏడీఏల ఆదేశం
పాలకొండ, నవంబరు26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎరువుల (శ్రీసాయి రైతు డిపో) దుకాణాన్ని సాలూరు, పాలకొండ ఏడీఏలు జి.సత్యవతి, రత్నకుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో లైసెన్స్ ఒకటే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన స్టాక్, బిల్లు పుస్తకాలు చూపించకపోవడంపై ఎరువుల దుకాణంలో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల ధరలు కూడా బోర్డు రూపంలో లేకపోవడం, ఈపోస్ మిషన్ ద్వారా రిపోర్టును చూపించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం దుకాణంలో ఉన్న ఎరు వులు, పురుగు మందులను పరిశీలించారు. గోడౌన్‌కు వెళ్లి నిల్వ ఉన్న ఎరువుల వివరాలు సేకరిం చారు. స్టాక్ రికార్డు, బిల్ పుస్తకాలను తీసుకురావాలని షాపు నిర్వాహకులను ఆదేశించారు.