No Signs of Decline.. తగ్గుముఖం పట్టట్లే..
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:59 PM
No Signs of Decline.. సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఏ గ్రామంలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. మలేరియా కేసులు తగ్గినప్పటికీ టైఫాయిడ్, విష జ్వరాలు మాత్రం విజృంభిస్తున్నాయి.
సీతంపేట రూరల్, జూలై7(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఏ గ్రామంలో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. మలేరియా కేసులు తగ్గినప్పటికీ టైఫాయిడ్, విష జ్వరాలు మాత్రం విజృంభిస్తున్నాయి. దీంతో సీతంపేట ఏరియా ఆసుపత్రి రోజూ రోగులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఓపీ 334 వరకు ఉండగా.. 19మంది మలేరియా, 87 మంది టైఫాయిడ్, విష జ్వరాలతో బాధపడుతున్నట్లు రక్తపరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో 42మంది ఏరియా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరారు. వీరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి పర్యవేక్షకులు శ్రీనివాసరావు తెలిపారు.