Share News

Fertilizers ఎరువుల కొరత లేదు

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:18 AM

No Shortage of Fertilizers జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 887 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇందులో 699 టన్నులు రైతు సేవా కేంద్రాలకు చేరిందని వెల్లడించారు. బుధవారం మార్క్‌ఫెడ్‌ బఫర్‌ ద్వారా 22 రైతు సేవా కేంద్రాలకు 252 టన్నుల యూరియాను తరలించినట్టు చెప్పారు.

  Fertilizers ఎరువుల కొరత లేదు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 887 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇందులో 699 టన్నులు రైతు సేవా కేంద్రాలకు చేరిందని వెల్లడించారు. బుధవారం మార్క్‌ఫెడ్‌ బఫర్‌ ద్వారా 22 రైతు సేవా కేంద్రాలకు 252 టన్నుల యూరియాను తరలించినట్టు చెప్పారు. కొమరాడ మండలానికి 30 , సీతంపేట 20, కురుపాం 32, సాలూరు 12 , జీఎల్‌పురం 30, జియ్యమ్మవలస 40, గరుగుబిల్లి 10, సీతానగరం, మక్కువ, బలిజిపేట పార్వతీపురం మండలాలకు 12 టన్నుల చొప్పున పంపినట్టు పేర్కొన్నారు. త్వరలో మరో 2,013 టన్నుల యూరియా జిల్లాకు రానుందని తెలిపారు. ప్రస్తుతం 1341 టన్నుల డీఏపీ, 1332 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 647 టన్నుల పొటాష్‌, 905 టన్నుల సూపర్‌ఫాస్పెట్‌ ఎరువులు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. ఎరువుల సమస్యలు తెలియజేసేందుకు కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ఈ 94401 04317, 79894 34766 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

రేపటి లోగా ప్రతిపాదనలు పంపాలి

అస్పిరేషనల్‌ డిస్ర్టిక్ట్‌, బ్లాక్‌ కార్యక్రమాల కింద నూతన ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులకు ఈ నెల 5లోగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నీతి అయోగ్‌కు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. డ్వామా, ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ పీడీలు, డీఈవో, డీఎంహెచ్‌వో, వ్యవసాయాశాఖాధికారులు, ఐటీడీఏ పీవోలు ఇందులో భాగస్వాముల వ్వాలన్నారు. నోడల్‌ ఆఫీసర్‌ మహేష్‌ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. 15న నీతి ఫ్రంటియర్‌ టెక్‌ హబ్‌ రేపోజోటోరీ ప్రారంభం కానుందని తెలిపారు. ఆరోగ్య, విద్య, వ్యవసాయం, డిజిటల్‌ లెర్నింగ్‌, పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీ రంగాల్లో సాంకేతికత ఆధారిత పరిష్కారాలను తెలుసుకో వచ్చన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:18 AM