మరమ్మతులు లేవు.. పర్యవేక్షణ లేదు
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:52 PM
: వీరఘట్టం సమీపంలో ఉన్న ఒట్టిగెడ్డ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మూడుదశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జి కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు.
వీరఘట్టం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం సమీపంలో ఉన్న ఒట్టిగెడ్డ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మూడుదశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జి కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు.కింది భాగం లో పెచ్చులూడి గజాలు కనిపిస్తున్నాయి.ఆర్‌అండ్‌బీ అధికారుల పర్య వేక్షణలేకపోవడంతో చిన్నపాటి వర్షంకురిసినా పైభాగంలోగల రోడ్డుపై నీరు నిల్వ ఉంటోంది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. దీనికితోడు బ్రిడ్జికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరగడంతో చోదకులు భయాందోళన చెందు తున్నారు. పాలకొండ-పార్వతీపురం ప్రధానరహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రతిరోజూ వెయ్యి వరకూ వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. దీనికితోడు రాయగడ వెళ్లే వారు కూడా ఈ మార్గానే ఆశ్రయిస్తుంటారు. తక్షణమే ఆర్‌అండ్‌బీ అధికారులు బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.
============