మరమ్మతులులేక.. అభివృద్ధికి నోచుకోక
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:37 PM
మండలంలోని మందరాడ నుంచి గోవిందపురం పీఆర్ రోడ్డు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకో వడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రోడ్డును అభివృద్ధిచేయడం లేదని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అడుగడుగునా గుతులమయమై చిన్నపాటి వర్షానికి బురదమ యమవుతోంది.
సంతకవిటి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మందరాడ నుంచి గోవిందపురం పీఆర్ రోడ్డు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకో వడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రోడ్డును అభివృద్ధిచేయడం లేదని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అడుగడుగునా గుతులమయమై చిన్నపాటి వర్షానికి బురదమ యమవుతోంది.
మందరాడ నుంచి గోవిందపురం రహదారిలో రెండు అడుగుల లోతులో భారీ గోతులు ఏర్పడడంతో వాహనచోదకులు, పాదచారులు అగచాట్లకు గురవుతున్నారు. రాజాం, సంతకవిటిలోని ఆసుపత్రులకు వెళ్లే సమయంలో గర్భిణులు గోతులు ఉన్నచోట ఇబ్బందిపడుతున్నారు. చీకటిపడిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణమంటే హడలిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఈరహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.రెండు దశాబ్దాల కిందట వేసిన బీటీరోడ్డు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో రాళ్లు తేలి మట్టిరాడ్డులా మారింది. ఈ మార్గంలో గోవిందపురం, నారాయ ణరాజపురం, మోదుగులపేట, ముఖుందపురం తదితర ఎనిమిది గ్రా మాలకు చెందిన 200 వందలు వాహనచోదకులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు.సంతకవిటి జూనియర్ కళాశాలకు, మందరాడ జడ్పీ ఉన్నతపాఠశాలకు వందమంది చొప్పున ప్రతిరోజూ వెళ్తుంటారు. రాజాం లోని డిగ్రీ కళాశాలలకు మందరాడ మీదుగా వందలాది మంది వెళ్తు న్నారు.అయితే వైసీపీ హయాంలో రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా బీటీ రోడ్డుపై ఉన్న లేయర్ పొర తీసి విడిచిపెట్టారు. దీంతో రాళ్లుతేలి అధ్వా నంగా మారడంతో కష్టాలు మరింతపెరిగాయి. దీంతో ద్విచక్ర వాహన చోదకులు రాళ్లపైపడి గాయడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ దృష్టికి స్థానికులు గోవిందపు రం-మందరాడ రహదారిదుస్థితిని తీసుకువెళ్లిన విషయం విదితమే. తక్షణమే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.