మరమ్మతులు లేక.. అధ్వానంగా మారి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:04 AM
:మండలంలోని కంబర నుంచి కాగితాడ వరకు ఉన్న రహదారి ఏళ్ల తరబడి కనీస మర మ్మతులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారింది. కిలోమీటరు మేర అడుగడుగునా గోతులమయంకావడంతో పాదచారులు, వాహన చోదకులు అగచాట్లకు గురవుతున్నారు.
వీరఘట్టం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):మండలంలోని కంబర నుంచి కాగితాడ వరకు ఉన్న రహదారి ఏళ్ల తరబడి కనీస మర మ్మతులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారింది. కిలోమీటరు మేర అడుగడుగునా గోతులమయంకావడంతో పాదచారులు, వాహన చోదకులు అగచాట్లకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా బురదమయంకావడంతో గోతుల్లో వాహనాలు కూరుకుపోతున్నాయి. 1500మంది జనాభాగల కంబర గ్రామస్థులతోపాటు కాగితాడ రైతుల పంట పొలాలకు ఈ రోడ్డు మీదుగానే వెళ్లాల్సిఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో పంటపొలాలకు వెళ్లే సమయంలో పడి గాయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. దీనికితోడు పంట ఉత్పత్తులను కల్లాలకు చేర్పేసమయంలో కూడా అవస్థలకు గురవుతు న్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు దుస్థితిని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దృష్టికి స్థానిక నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడుతోపాటు గ్రామస్థులు తీసుకువెళ్లారు. తక్షణమే రహదారిని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.