No Provocative Comments రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు
ABN , Publish Date - May 10 , 2025 | 11:15 PM
No Provocative Comments దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రతిఒక్కరూ బాధ్యతతో మెలగాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహ రించినా.. వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు.
బెలగాం, మే 10(ఆంధ్రజ్యోతి) : దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రతిఒక్కరూ బాధ్యతతో మెలగాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహ రించినా.. వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు. ప్రతి పౌరుడు సైనికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. శనివారం తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో త్రివిధ దళాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ సహకరించా లన్నారు. ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా మారాలని తెలిపారు. జిల్లాలో ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలకు అనుమతుల్లేవని సృష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దేశం, మతం తదితర అంశాలపై అనధికార సందేశాలను ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం సరికాదన్నారు. అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడం, ప్రోత్సహించడం, సహకరించడం చటట్టరీత్యా నేరమని వెల్లడించారు. సోషల్ మీడియాపై సైబర్ సెల్ పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు.