Survey Work సర్వేపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:19 AM
No Negligence in Survey Work గ్రామాల్లో చేపట్టే గృహ నిర్మాణాల సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హౌసింగ్ ఈఈ జి.సోమేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. పీఎంఏవై గ్రామీణ ఆవాస్ ప్లస్ సర్వే కోసం 34 బృందాలను నియమించామని వెల్లడించారు.
గరుగుబిల్లి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపట్టే గృహ నిర్మాణాల సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హౌసింగ్ ఈఈ జి.సోమేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. పీఎంఏవై గ్రామీణ ఆవాస్ ప్లస్ సర్వే కోసం 34 బృందాలను నియమించామని వెల్లడించారు. ఈ నెల 29లోగా నమోదు పక్రియ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో గృహ నిర్మాణం చేపట్టని వారిని , ఇంటి స్థలం ఉన్నా, లేకపోయినా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సర్వేలో నమోదు కాకుంటే ఇళ్ల మంజూరుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 15 మండలాల్లో 23,344 మందిని గుర్తించామని, 16,237 మంది వివరాలు సేకరణ పూర్తయిందని చెప్పారు. మరో 7,107 మందికి సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. గతంలో నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో రూపాయి జమ అయిన వారి వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పక్కాగా సర్వే నిర్వహించి తగు నివేదికలు అందించాలన్నారు. ఈ విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జి.పైడితల్లి, ఏఈ వి.అఖిల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.