Share News

No more discussion on Jindal. జిందాల్‌పై ఇక చర్చల్లేవ్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:27 PM

No more discussion on Jindal. కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం వద్దనున్న జిందాల్‌ కర్మాగారం తెరిచే విషయంలో ఇకపై ఎటువంటి చర్యలకు అంగీకరించబోమని ఇరుపక్షాలు మంగళవారం జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎస్‌డీవీ.ప్రసాదరావు ఎదుట అంగీకరించారు.

No more discussion on Jindal. జిందాల్‌పై ఇక చర్చల్లేవ్‌
జిందాల్‌ చర్చలపై సంతకాలు చేసి ఉప కమిషనర్‌కు ఇస్తున్న కార్మికులు

జిందాల్‌పై ఇక చర్చల్లేవ్‌

నిరాశతో అంగీకరించిన కార్మికులు

లక్కవరపుకోట (కొత్తవలస), నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం వద్దనున్న జిందాల్‌ కర్మాగారం తెరిచే విషయంలో ఇకపై ఎటువంటి చర్యలకు అంగీకరించబోమని ఇరుపక్షాలు మంగళవారం జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎస్‌డీవీ.ప్రసాదరావు ఎదుట అంగీకరించారు. జిందాల్‌ యాజమాన్యం తరపున డీజీఎం గోపాలకృష్ణారావు, కార్మిక యూనియన్‌ తరపున లెంక శ్రీను, ఇతర కార్మిక నేతలు హాజరై జిల్లా కార్మికశాఖాధికారి ఎదుట చర్చలు జరిపారు. కార్మికుల తరపున మూడు ప్రధానమైన డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచారు. కంపెనీ తెరవాలని, లేదా లేఆఫ్‌ విధానంలో జీతాలు ఇవ్వాలని, లేదా జామ్‌పూర్‌ పంపించి రెట్టింపు జీతాలు, వసతి కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన డీజీఎం మాట్లాడుతూ రామెటీరియల్‌, విద్యుత్‌ చార్జీలు పెరిగినందున కంపెనీ తెరవలేమని, ఏ ఒక్క డిమాండ్‌ అమలు చేయలేమని చెప్పారు. మరోమారు చర్చలు జరుపుదామని ఉప కార్మికశాఖ అధికారి సూచించగా అందుకు ఇరువర్గాలు అంగీకరించలేదు. కార్మికులు పరిశ్రమపై పూర్తి నిరాశతో తాము కూడా ఇకముందు ఎలాంటి చర్చలకు రాబోమన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:27 PM