Share News

ఎన్ని కేసులు పెట్టినా భూములు వదులుకోం

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:07 AM

:తాము సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తిలేదని కారేడువలస గిరిజనులు తెలిపారు. తమపై 107 కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదని, తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆడబోమని తెల్చిచెప్పారు.

 ఎన్ని కేసులు పెట్టినా భూములు వదులుకోం
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న గిరిజనులు:

రామభద్రపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి):తాము సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తిలేదని కారేడువలస గిరిజనులు తెలిపారు. తమపై 107 కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదని, తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆడబోమని తెల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా భూములు వదులుకోమని స్పష్టంచేశారు. మంగళవారం రామభద్రపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర సన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తాము సాగుచేసుకున్న భూములకు ఏపీ ఐఐసీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. పేద గిరిజనులపై బైండోవర్‌ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం అధికారులకు న్యాయమా అని ప్రశ్నించారు. చంటిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యం ఉన్న వారిపై కూడా బైండోవర్‌ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కార్యక్రమంలో మిర్తివలస సర్పంచ్‌ మజ్జి రాంబాబు, గిరి జన సంఘాల నాయకులు తౌడమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:07 AM