Share News

నిర్వహణ లేక.. పూడికలు తొలగించక

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:27 AM

:మండలంలోని అలజంగి శివారున గల సీతారామసాగర్‌ చెరువు నుంచి అలజంగి, పిరిడి పరిధిలోని వందలాది ఎకరాలకు నీరు అందించే కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోయాయి. ప్రధానంగా అధికారులు పూడిక తొలగింపు, నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిర్వహణ లేక.. పూడికలు తొలగించక
కాలువలో పేరుకుపోయిన పూడికలు

బొబ్బిలి రూరల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి):మండలంలోని అలజంగి శివారున గల సీతారామసాగర్‌ చెరువు నుంచి అలజంగి, పిరిడి పరిధిలోని వందలాది ఎకరాలకు నీరు అందించే కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోయాయి. ప్రధానంగా అధికారులు పూడిక తొలగింపు, నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.త్వరలో ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభంకానుండడంతో కాలువలో పూడికలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. తక్షణమే వర్షాకాలం ప్రారంభం కాకముందే పూడికలు తొలగించకపోతే సాగు నీరు ప్రవహించడం కష్టమని పలు వురు చెబుతున్నారు.పూడికలు తొలగించాలని పలుపార్లు ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. కాగా ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేయించి కాలువలో నీరు పారేలా చర్యలు తీసుకుంటామని ఏపీవో లక్ష్మిపతిరాజు తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 12:27 AM