Share News

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:09 AM

మండల కేంద్రంలోని మద్యం దుకాణం ఎదుట స్థానికులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

జనావాసాల్లో మద్యం దుకాణం వద్దు
మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేపడుతున్న స్థానికులు

బొండపల్లి, జూన్‌20(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని మద్యం దుకాణం ఎదుట స్థానికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య ఏర్పా టు చేసిన మద్యం దుకాణాన్ని తరలించాలని వారు డిమాండ్‌ చేశారు. తర చూ ఇబ్బంది పడుతున్నామని వారు మండిపడ్డారు. దాంతో ఎస్‌ఐ లెంక గోపి అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గజపతినగరం ఎక్సైజ్‌ సీఐ జె.జగన్నాథరావు, ఎస్‌ఐ పి.నరేంద్రకుమార్‌లకు సమాచారం అందజే శారు. దాంతో వారు అక్కడకు చేరుకుని గ్రామపెద్దలు చలుమూరి మూర్తి, మాజీ ఎంపీపీ బండారు బంగారం, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పట్నాల శ్రీని వాసరావు, ఎంపీటీసీ సభ్యుడు గొండేల ఈశ్వరరావు, చిరంజీవిరాజు తది తరులతో మాట్లాడారు. అయినప్పటికీ తక్షణమే మద్యం దుఖాణం తొలగిం చాలని స్థానిక యాతపేట, గొల్లవీధికి చెందిన పలువురు మహిళలు, యువత ఆందోళన చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాంతో ఎక్సైజ్‌ సీఐ జనార్దనరావు మాట్లాడుతూ ఆందోళన విరమించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. గతంలో ఇదే మాదిరి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితి మారలేదని, ఇప్పటికైనా అధికా రులు స్పందించి మద్యం దుకాణం తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:10 AM