హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దు
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:02 AM
హైడ్రో పవర్ ప్రాజెక్టు అను మతులను తక్షణమే రద్దుచేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈమేరకుబుధవారం పాచిపెంట తహసీల్దార్‌కార్యాలయం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు.
పాచిపెంట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హైడ్రో పవర్ ప్రాజెక్టు అను మతులను తక్షణమే రద్దుచేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈమేరకుబుధవారం పాచిపెంట తహసీల్దార్‌కార్యాలయం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. తొలుత ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాల యం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ డి.రవికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ పవర్ ప్రాజెక్టు నిర్మాణంవల్ల సతాభి, తంగ్లాం, గిరిసిగుడ్డి, మూట కూడు, గొట్టూరు పంచాయతీల ఆదివాసీలు జలసమాధి అవుతా రని తెలిపారు. గిరిజనుల అనుమతి లేకుండా డ్రోన్ల ద్వారా సర్వేచేసి రాళ్లు పాతుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నవయుగ కంపెనీకి ఇచ్చిన జీవో- 13ను తక్షణమే రద్దు చేయా లని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘాల జిల్లా గౌరవవా ధ్యక్షుడు సీదరపు అప్పారావు, సీపీఎం మండల నాయకులు కోరాడ ఈశ్వరరావు, గిరిజన సర్పంచ్‌లు, గిరిజనులు పాల్గొన్నారు.