Drinking Water తాగునీటి సమస్యలు తలెత్తరాదు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:12 AM
No Drinking Water Issues Should Arise వేసవి నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

పార్వతీపురం, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమస్య ఉన్న చోట తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పక్కాగా నీటి నాణ్యత పరీక్షలు చేపట్టాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో చేపట్టే 14 రకాల టెస్ట్‌లను రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. వేసవిలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ యూనిట్ల ఏర్పాటు వేగవంతం
జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రకియ వెంటనే పూర్తి చేసి బ్యాంకుల సమన్వయంతో రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఆ వివరాలను బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగిన్‌కు వెంటనే పంపించాలన్నారు. జిల్లాలో 1221 యూనిట్లను రూ.23.24 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.