Share News

No Dolly డోలీ మోతలు ఉండరాదు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:00 AM

No Dolly Moths Allowed జిల్లాలో ఎక్కడా డోలీ మోతలు ఉండరాదని, వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అంబులెన్స్‌ సర్వీస్‌ సేవలు అందుబాటులో ఉండాలని, కేఈఐ డాష్‌ బోర్డును తరచూ పర్యవేక్షించాలని సూచించారు.

No Dolly  డోలీ మోతలు ఉండరాదు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా డోలీ మోతలు ఉండరాదని, వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అంబులెన్స్‌ సర్వీస్‌ సేవలు అందుబాటులో ఉండాలని, కేఈఐ డాష్‌ బోర్డును తరచూ పర్యవేక్షించాలని సూచించారు. తప్పనిసరిగా గర్భిణుల వివరాలు నమోదు చేయాలని, బాల్య వివాహాలను నివారించాలని చెప్పారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మలేరియా కేసులు తగ్గించాలని ఆదేశించారు. వైద్య పరికరాలు, మందులో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రామీణా భివృద్ధి , జిల్లా నీటియాజమాన్య సంస్థల లక్ష్యాలను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ఉచిత వైద్య సేవలు

బెలగాం : ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మహిళలందరికీ ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2 వరకు మహిళలకు వైద్య సేవలు అందించి, ఉచింతగా మందులు ఇస్తామన్నారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వైశాలి, ఏఎస్పీ అంకితా సురాన, డీసీహెచ్‌ నాగభూషణరావు, ఐసీడీఎప్‌ పీడీ కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:00 AM