Share News

No Changes ఎటువంటి మార్పుల్లేవ్‌..

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:47 PM

No Changes at All రాష్ట్రంలో మరో మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎటువంటి మార్పులు చేయలేదు.

No Changes  ఎటువంటి మార్పుల్లేవ్‌..

  • నియోజకవర్గం మాత్రం సాలూరే..

  • ప్రకటించిన ప్రభుత్వం

పార్వతీపురం,నవంబరు25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది. కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎటువంటి మార్పులు చేయలేదు. సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మెంటాడను రాజకీయ కారణాల రీత్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం విజయనగరంలో చేర్చింది. దీనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనపైనా పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ ఒకే డివిజన్‌ పరిధిలో ఉండాలనే సర్కారు భావించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మార్పులుంటాయని అంతా భావించారు. కానీ మెంటాడను విజయనగరం జిల్లాలోనే ఉంచారు. ఈ మండలాన్ని పార్వతీపురం మన్యంలో చేర్చలేదు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయం జిల్లాలో అమలు కాలేదు.

పాలకొండ జిల్లా లేనట్టే...

పాలకొండను జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలో కొంతమంది డిమాండ్‌ చేశారు. జిల్లా ఏర్పాటుకు ఏర్పడిన కమిటీ ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కురుపాం నియోజకవర్గంలోని నీలకంఠాపురం మండలం ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ఏటువంటి ప్రకటన చేయలేదు.

Updated Date - Nov 25 , 2025 | 11:47 PM