Share News

రాత్రి గస్తీని ముమ్మరం చేయాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:57 PM

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి పూట గస్తీని ముమ్మరం చేయాలని, ముఖ్యమైన కూడళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఎఆర్‌ దామోదర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

రాత్రి గస్తీని ముమ్మరం చేయాలి
మాట్లాడుతున్న దామోదర్‌ :

విజయనగరం క్రైం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి పూట గస్తీని ముమ్మరం చేయాలని, ముఖ్యమైన కూడళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఎఆర్‌ దామోదర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేరాలు నియంత్రించడంలో హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ప్రధానమన్నారు. రాత్రి సమయాల్లో అను మానిత వ్యక్తులు కనిపిస్తే, వారి వేలిముద్రలు సేకరించాలన్నారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తులు, పాతనేరస్థుల ప్రస్తుత జీవన విధానాన్ని గమ నిస్తూ ఉండాలని, కౌన్సెలింగ్‌ నిర్వహించే సమయంలో వారి పనితీరును గమనించాలన్నారు. సోషల్‌మీడియాలో అవాస్తవాలు ప్రచారంచేస్తే కేసులు నమోదు చేయాలని కోరారు. సమావేశం లో ఎఎస్‌పీ సౌమ్యలత,డీఎస్పీలు గోవిందరావు, భవ్యారెడ్డి, రాఘ వులు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాసరచన విజేతలకు బహుమతులు

జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశా లలు, పోలీసుల పిల్లలు, పోలీసు ఉద్యోగులకు వేర్వేరుగా పోలీసు అమరవీరుల సంస్మరణవారోత్స వాల్లో భాగంగా వ్యాసరచన, వృక్తత్త్వ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రొత్సాహక నగదు బహుమతులను మం గళవారం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా లైంగిక వేధింపుల నుంచి మహిళలు, పిల్లలను రక్షించడంలో విద్యార్థుల పాత్ర అన్న అంశంపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. నేటి పోలీసీంగ్‌లో టెక్నా లజీ పాత్ర అన్న అం శంపైకూడా గతనెల 24న జిల్లా కేంద్రలో పోటీలు నిర్వహిం చామని తెలిపారు. ఈ పోటీల్లో హెచ్‌సీ దావె ూదరరావు, ఆర్‌ఎస్‌ఐ సూర్యనారాయణ, హెచ్‌సీ జనార్దన్‌రావు విజేతలుగా నిలిచారు.అలాగే భార్గవ్‌,గౌరవ్‌, యుగంధర్‌, మేఘన, మోక్షిత, యామిని, చక్రీ, నిహారిక, ప్రతీక్‌ ,పూజిత, భాషిణీలను అభినందించి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ ఎవీ లీలారావు, ఆర్‌ఐ గోపాలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:57 PM