New Teachers విజయవాడకు కొత్త మాస్టార్లు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:03 AM
New Teachers for Vijayawada మెగా ఎస్సీలో ఎంపికైన కొత్త గురువులు బుధవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. గురువారం సీఎం చంద్ర బాబునాయుడు చేతుల మీదుగా వారు ఉద్యోగ నియామక పత్రాలను అందుకో నున్నారు.
సాలూరు రూరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మెగా ఎస్సీలో ఎంపికైన కొత్త గురువులు బుధవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. గురువారం సీఎం చంద్ర బాబునాయుడు చేతుల మీదుగా వారు ఉద్యోగ నియామక పత్రాలను అందుకో నున్నారు. ఉమ్మడి జిల్లాలో 578 ఖాళీ టీచర్ పోస్టులకు 578 మందిని ఎంపిక చేయగా.. కొత్త గురువులంతా వారి సహాయకులతో కలిసి ఉదయమే డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ అధికారులు వారికి అల్పాహారం అందించారు. అనంతరం గుర్తింపు కార్డులిచ్చారు. టీమ్‌లుగా ఏర్పాటు చేసి, టీమ్ లీడర్లు తదితరులతో వారికి కేటాయించిన బస్సుల్లో ఎక్కించారు. మొత్తంగా 40 బస్సుల్లో విజయవాడకు బయల్దేరారు. 20 మంది ఎస్కార్ట్ , 12 మంది మెడికల్ ఆఫీసర్లు కూడా వారి వెంట ఉన్నారు. మధ్యాహ్నం పాయకరావుపేటలో భోజనం అందించారు. సాయంత్రం దివాన్ చెరువు వద్ద టీ కోసం బస్సులను నిలిపారు. రాత్రికి వారంతా విజయవాడ చేరుకున్నారు. ఉమ్మడి జిల్లావాసు లకు గూడవల్లి కేకేఆర్ గౌతమ్‌లో బస, భోజన ఏర్పాట్లు చేశారు. కొత్త గురువులు మరి కొద్ది గంటల్లో పోస్టింగ్ ఆర్డర్లు తీసుకోనున్నారు.