Share News

నేడు నూతన గృహ ప్రవేశాలు

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:54 PM

పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను బుధవారం ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్నద్ధమవుతు న్నారు.

నేడు నూతన గృహ ప్రవేశాలు

పార్వతీపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల నెరవేరనుంది. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను బుధవారం ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్నద్ధమవుతు న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేసింది. సొంత స్థలం ఉన్నవారికి గృహాల మంజూరు చేసింది. జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో పూర్తయిన ఇళ్లకు సంబంధించి బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. సాలూరులో జరిగే కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మ చంద్రారెడ్డి, కురుపాంలో ప్రభుత్వ విప్‌ తోయక జదీశ్వరి, పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, పాలకొండ నగర పంచాయతీలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పాల్గొననున్నారు. సాలూరు నియోజకవర్గంలో మం త్రి సంధ్యారాణితో పాటుఈ కార్య క్రమంలో పాల్గొనున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:54 PM