Share News

New Bar Policy నూతన బార్‌ పాలసీ గెజిట్‌ విడుదల

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:32 AM

New Bar Policy Gazette Released రాష్ట్ర ప్రభుత్వం 2025-28కి గాను నూతన బార్‌ పాలసీ గెజిట్‌ను విడుదల చేసినట్లు ఏఈఎస్‌ సంతోష్‌ తెలిపారు.

  New Bar Policy  నూతన బార్‌ పాలసీ గెజిట్‌ విడుదల

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం 2025-28కి గాను నూతన బార్‌ పాలసీ గెజిట్‌ను విడుదల చేసినట్లు ఏఈఎస్‌ సంతోష్‌ తెలిపారు. సోమవారం స్థానిక ఎక్సైజ్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ మూడేళ్ల పాటు బార్‌లను నిర్వహించాలనుకునే వారి నుంచి ఈనెల 26 వరకు పార్వతీపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో దరఖా స్తులను స్వీకరిస్తాం. పార్వతీపురంలో 4, పాలకొండ 1, సాలూరులో 3 బార్‌ షాపులు, సెగిడి వారికి పార్వతీపురం, శ్రీసైన వారికి పాలకొండలో దుకాణాలు కేటాయించాం. ఈనెల 28న కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా లాటరీ వేసి ఎనిమిది బార్‌లతోపాటు రెండు షాపులను మంజూరు చేస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 12:32 AM