Re-Survey రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:23 AM
Negligence in Re-Survey is Unacceptable భూ రీసర్వేపై నిర్లక్ష్యం వహించరాదని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

గరుగుబిల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): భూ రీసర్వేపై నిర్లక్ష్యం వహించరాదని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో మొదటి విడతగా దళాయివలస, రెండవ విడతలో సుంకి, వల్లరిగుడబ గ్రామాలను రీ సర్వేకు గుర్తించినట్లు చెప్పారు. గ్రామాల్లో సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించి.. వారి సమక్షంలోలే ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని, రైతుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవవని హెచ్చరించారు. భూసమస్యలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దీనికి సంబంధించి రికార్డులు సిద్ధం చేయాలని సూచించారు. పోలినాయుడువలసలో భూసమస్యలు పరిష్కరి స్తామని తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా మ్యూటేషన్లు నిర్వహణ పూర్తి చేయాలన్నారు.
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
పార్వతీపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి గిరిజన గ్రామానికి వెళ్లి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ జీసీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కోల్ట్‌స్టోరేజ్, గోడౌన్‌కు తరలించాలన్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా మంది దళారులు గిరిజనులను మోసం చేసి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. అటువంటివారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలాఖరుకు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.