Share News

Unacceptable విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:17 PM

Negligence in Duty is Unacceptable విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీఎస్‌ పద్మావతి ఆదేశించారు. మంగళవారం జీటీ వాడ, శిఖబడి ప్రాథమిక ఉప కేంద్రాలు, బీజే పురంలో వైద్యశిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

 Unacceptable విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
బీజే పురంలో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో

జియ్యమ్మవలస, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీఎస్‌ పద్మావతి ఆదేశించారు. మంగళవారం జీటీ వాడ, శిఖబడి ప్రాథమిక ఉప కేంద్రాలు, బీజే పురంలో వైద్యశిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని రకాల ఓపీ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గర్భిణుల రిజిస్ట్రేషన్‌ కచ్చితంగా ఉండాలన్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. గర్భిణుల్లో రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు సికిల్‌సెల్‌ అనీమియా పరీక్షలు చేయాలని ఆదేశించారు. అభా ఐడీ క్రియేట్‌ చేయా లన్నారు. మలేరియా వ్యాప్తి , దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. జియ్యమ్మవలస పీహెచ్‌సీ వైద్యాధికారి పి.జగదీష్‌, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:17 PM