Field Level క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:18 AM
Need to Tour at the Field Level జిల్లాలోని మండల ప్రత్యేకాధి కారులు, ఎంపీడీవోలు, డిప్యూటీ అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిం చాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సకాలంలో సిబ్బంది వస్తున్నదీ, లేనిది పరిశీలించాలని సూచించారు.
పార్వతీపురం, నవంబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మండల ప్రత్యేకాధి కారులు, ఎంపీడీవోలు, డిప్యూటీ అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిం చాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సకాలంలో సిబ్బంది వస్తున్నదీ, లేనిది పరిశీలించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో రాత్రి వేళల్లో బస చేయా లన్నారు. నెలలో మూడు రోజులైనా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రిజర్వాయర్లు, వాగులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించి ప్లాస్టిక్, పాలిథిన్ నియం త్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణానికి 500 మీటర్లలో చెత్త కనిపిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మలవిసర్జనపై చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, జిల్లాలో ఎక్కడా బాల కార్మికులు లేకుండా చూడాలని సూచించారు.
రెవెన్యూ సమస్యలపై స్పష్టత తప్పనిసరి
పీజీఆర్‌ఎస్‌లో వచ్చే రెవెన్యూ వినతులపై స్పష్టత ఉండాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తేల్చిచెప్పారు. సమస్యను బాగా అర్థం చేసుకున్నప్పుడే దానికి సరైన పరిష్కారం చూపగలరన్నారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. మండలాల వారీగా పెండింగ్ అర్జీల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అర్జీని సింగిల్ పేజీ నోట్ రూపంలో పరిష్కరించాలని సూచిం చారు. జిల్లాలో నీటి వనరులు, చెరువులు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.