Share News

Awareness on AIDS ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:29 PM

Need to Raise Awareness on AIDS హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

  Awareness on AIDS  ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీలో కలెక్టర్‌ తదితరులు

పార్వతీపురం/బెలగాం, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ‘హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులపై వివక్ష చూపకూడదు. సమాజంలో వారు కూడా భాగమే. వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇది వ్యాధి నియంత్రణకు తొలిమెట్టు. వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖను సంప్రదించాలి. ఎయిడ్స్‌పై యువత అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత జీవన విధానాలను పాటించాలి.’ అని కలెక్టర్‌ తెలిపారు. హెచ్‌ఐవీ అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అది ఒక సామాజిక సమస్య అని అన్నారు. అవగాహనతోనే దానిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌సీఎం నుంచి కలెక్టరేట్‌ వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి ఎం.వినోద్‌కుమార్‌, ప్రోగ్రాం మేనేజర్‌ టి.జగన్మోహన్‌రావు, డీసీహెచ్‌ఎస్‌ జి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:29 PM