Revenue Employees రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:27 PM
Need to Increase the Number of Revenue Employees రెవెన్యూ శాఖలో అవసరమైన చోట ఉద్యోగుల సంఖ్యను పెంచితే మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
బెలగాం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ శాఖలో అవసరమైన చోట ఉద్యోగుల సంఖ్యను పెంచితే మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పార్వతీపురంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. మెరుగైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. సాంకేతికతలో మార్పులు చోటు చేసుకున్నాయని, రెవెన్యూ అకాడమీ పెట్టి ఉద్యోగు లకు శిక్షణ ఇస్తే ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో 108 తహసీల్దార్, 26 ఆర్డీవో కార్యాలయాల కొరత ఉందని అన్నారు.