Share News

Natural Farming… Highly Rewarding ప్రకృతి సాగు.. బహుబాగు

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:01 AM

Natural Farming… Highly Rewarding ప్రకృతి సాగుపద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన సువ్వాడ గణేష్‌. ప్రకృతి సాగులో పంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఇది సురక్షిత ఆహారమని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వారి సలహా, సూచనలతో సాగు చేపట్టి విజయం సాధించారు.

Natural Farming… Highly Rewarding  ప్రకృతి సాగు.. బహుబాగు
టమాటా సాగు చేస్తున్న రైతు

సాలూరు రూరల్‌, జూన్‌6(ఆంధ్రజ్యోతి): ప్రకృతి సాగుపద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన సువ్వాడ గణేష్‌. ప్రకృతి సాగులో పంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఇది సురక్షిత ఆహారమని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వారి సలహా, సూచనలతో సాగు చేపట్టి విజయం సాధించారు. తొలుత గ్రామంలోని తన ఐదు ఎకరాల్లో పామాయిల్‌ వేశారు. అయితే ఆయా మొక్కలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఈ మేరకు సేంద్రియ పద్ధతుల్లో అంతర పంటలుగా టమాటా, బొప్పాయి, వంగ, మిరప, బంతి, చామంతి, కొమ్ముశనగ సాగు చేపట్టారు. ఒకే ప్రాంతంలో వివిధ రకాల పంటలను పండించి మంచి ఫలితాలు పొందారు. పామాయిల్‌ చేతికొచ్చే సమయం కంటే ముందే పూలు, కూరగాయాలు, బొప్పాయి ద్వారా ఆయన అధికాదాయం పొందుతున్నారు. వాస్తవంగా ప్రకృతి సాగుతో పండించే వాటికి డిమాండ్‌ ఎక్కువ. దీంతో కూరగాయలు తదితర వాటిని విక్రయిస్తూ.. సాగును లాభసాటిగా మార్చు కున్నారు. మొత్తంగా ప్రకృతి సాగులో ఆరోగ్యకర పంటలను అందిస్తూ పలువురు రైతులకు ఆయన మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:01 AM