Share News

దేశ సమగ్రతను కాపాడాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:51 PM

దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు పిలుపునిచ్చారు.

 దేశ సమగ్రతను కాపాడాలి: ఎమ్మెల్యే
ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు

చీపురుపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం చీపురుపల్లిలో గాంధీబొమ్మ జంక్షన్‌ నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకూ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150 జయంతి పురస్కరించుకుని మైభారత్‌ ఆధ్వర్యంలో ఏక్తా దివస్‌ కార్యక్రమం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్‌ మన్నెపురి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆధ్వర్యంలో జరిగినకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ, డీఎస్పీ రాఘవులు, టీడీపీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, ఆరతి సాహు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దాసరి శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:51 PM