Share News

నర్సిపురం ఆదర్శంగా నిలవాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM

మం డలంలోని నర్సిపురం గ్రామం అనేక ఆహార ధాన్యాలు, కూరగాయలు పండిస్తోందని, వీటిని రాష్ట్ర స్థాయిలో సరఫరా చేసి ఆదర్శంగా నిలవాలని, తన సహాయ సహ కారాలు ఎప్పుడూ ఉంటాయని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

నర్సిపురం ఆదర్శంగా నిలవాలి
లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

  • పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర

  • ఎస్సీ కార్పొరేషన్‌, పీఎం అజయ్‌ రుణాల పంపిణీ

పార్వతీపురం రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని నర్సిపురం గ్రామం అనేక ఆహార ధాన్యాలు, కూరగాయలు పండిస్తోందని, వీటిని రాష్ట్ర స్థాయిలో సరఫరా చేసి ఆదర్శంగా నిలవాలని, తన సహాయ సహ కారాలు ఎప్పుడూ ఉంటాయని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్‌, పీఎం అజయ్‌ రుణాల మంజూరు కోసం దరఖాస్తు చేసి న ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆయ న శుక్రవారం నర్సిపురం గ్రామంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 23 మంది లబ్ధిదారులకు ఈ రుణాలు మంజూరయ్యాయని, అందు లో పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు రుణాలు వచ్చాయని చెప్పారు. ఈ 8మంది లో ఆరుగురు నర్సిపురం గ్రామస్థులు కావడం అభినంద నీయమన్నారు. నర్సిపురం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలవాలని, ఆ దిశగా మీరంతా కష్టపడి పంటలు పండిం చి ఎగుమతులు చేయాలని ఆయన సూచించారు. ఇతర జిల్లాల వలే నర్సిపురం అవకాయ పచ్చడి, నిమ్మకాయ, ఊరగాయ పచ్చళ్లు, నువ్వు అప్పడాలు, నెయ్యి అప్పడాలు ఇలా వివిధ రకాల పదార్థాలు తయారుచేసి ఎగుమతి చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం తరపున, తన తరపు న ఆర్థిక సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకట్‌నాయుడు, గొట్టాపు వెంకటరమణ, బోను చంద్రమౌళి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:13 AM