Namo Venkatesha నమో వేంకటేశ!
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:07 AM
Namo Venkatesha ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసంలో ఆఖరి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సుమారు 7 వేలకు పైగా జనం తరలివచ్చారు.
క్యూలైన్లు కిటకిట
7 వేలకు పైగా తరలివచ్చిన జనం
అసౌకర్యం కలగకుండా చర్యలు
గరుగుబిల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసంలో ఆఖరి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సుమారు 7 వేలకు పైగా జనం తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం స్వామివారిని దర్శించు కున్నారు. ముందుగా దేవస్థానాల పరిధిలో ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్ ప్రత్యేక క్యూలైన్లతో పాటు టెంట్లను ఏర్పాటు చేశారు. దర్శనం సమయంలో తోపులాట జరగకుండా ఎస్‌ఐ ఫకృద్ధీన్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి దేవస్థానం అభివృద్ధి ట్రస్ట్ ఉచిత ప్రసాదాలు, అన్నసమారాధన, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. 200 మంది శ్రీవారి సేవకులను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. మొత్తంగా దేవస్థానం ప్రాంగణాలు నమో వెంకటేశాయ, గోవింద నామస్మరణతో మార్మోగాయి.