Nagaland Team అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించిన నాగాలాండ్ బృందం
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:52 PM
Nagaland Team Inspects Anganwadi Center పలగర గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం నాగాలాండ్ బృంద సభ్యులు హవీబు మేహపు, లాంగ్ కుహం సందర్శించారు. ఐసీడీఎస్ పీడీ కనకదుర్గతో కలిసి కేంద్రంలో పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు.
బలిజిపేట, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): పలగర గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం నాగాలాండ్ బృంద సభ్యులు హవీబు మేహపు, లాంగ్ కుహం సందర్శించారు. ఐసీడీఎస్ పీడీ కనకదుర్గతో కలిసి కేంద్రంలో పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. తాగునీటి సదుపాయం, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3-6 సంవత్సరాల పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం రుచులను పరిశీలించారు. అనంతరం గర్భిణులకు సీమంతం చేశారు. లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పౌష్టికాహారం అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీడీపీవో సులేఖ, పర్యవేక్షకులు పాల్గొన్నారు.