నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:00 AM
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ దామోదర్ సూచించారు. శనివారం వంగర పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు.
వంగర, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ దామోదర్ సూచించారు. శనివారం వంగర పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ ప్రాంగణం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీ సు వ్యవస్థపై ప్రజలకు నమ్మకంకలిగేలా వ్యవహరించాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చెక్‌గేట్‌లు ఏర్పాటు చేశామ న్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక టీంలు నియమించామన్నారు. గ్రామ స్థాయిలో శాంతి కమిటీల ద్వారా క్రైం రేటు పూర్తిగా తగ్గించగలిగామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అధునాతన డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆయనవెంట డీఎస్పీ రాఘవులు, సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐ, సిబ్బంది ఉన్నారు.
ఫ గరివిడి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): గరివిడి పోలీసు స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ శనివారం సందర్శించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్‌ఐ లోకేశ్వరరావు పాల్గొన్నారు.
ఫరేగిడి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రేగిడి పోలీసు స్టేషన్‌ను శనివా రం ఎస్పీ దామోదర్ తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న విశ్రాంతి భవనం, గార్డెన్, రిసెప్షన్ భవనాన్ని పరిశీలించారు. నేరాల రేటు అదుపునకు రౌడీ షీటర్లుపై కఠినంగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, సైబర్‌నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగదారులపై ఉక్కుపాదం మోపాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రాఘవులు, సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ బాలకృష్ణ పాల్గొన్నారు.
ఫ చీపురుపల్లి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. శనివారం ఆయన చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎస్పీ ఎస్. రాఘవులు, సీఐ జి.శంకరరావు, సిబ్బంది ఉన్నారు.
ఫ గుర్ల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): గుర్ల పోలీసు స్టేషన్‌లో ఎస్పీ రామోదరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.ఖాళీ స్థలం కూడా శుభ్రం చేసి కూరగాయలు, మొక్కలుపెంచాలని సూచించారు.గ్రామాల పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్ర మంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులతోపాటు సీఐ శంకరరావు, ఎస్‌ఐ నారాయణరావులు పాల్గొన్నారు.