Share News

Must perform duties honestly నిజాయితీగా విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:10 AM

Must perform duties honestly పోలీసు విభాగంలో విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, సేవా తత్పరత అత్యంత ముఖ్యమని, ఆ దిశగా అడుగులు వేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్‌ ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా డీఐజీని బుధవారం కలిశారు.

Must perform duties honestly నిజాయితీగా విధులు నిర్వర్తించాలి
ప్రొబేషనరీ ఎస్‌ఐలతో డీఐజీ గోపీనాథ్‌జెట్టి

నిజాయితీగా విధులు నిర్వర్తించాలి

విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

విజయనగరం క్రైం, జూలై 23(ఆంధ్రజ్యోతి): పోలీసు విభాగంలో విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, సేవా తత్పరత అత్యంత ముఖ్యమని, ఆ దిశగా అడుగులు వేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్‌ ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా డీఐజీని బుధవారం కలిశారు. 49 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐల్లో 33 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. అనకాపల్లి జిల్లాకు 10, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 10, విజయనగరం 9, పార్వతీపురం మన్యం 10, శ్రీకాకుళం జిల్లాకు 10 మందిని కేటాయించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీసు స్టేషన్‌లో విధులు, రికార్డులు, చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు ఉన్నప్పుడే సమర్థవంతమైన పోలీసింగు సాధ్యమౌతుంద న్నారు. కార్యక్రమంలో ఎస్పీలు అమిత్‌బర్దర్‌, వకుల్‌జిందాల్‌, మహేశ్వరరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:10 AM