వైద్య కళాశాలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:22 AM
ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. మెడి కల్ కళాశాల నిర్మాణం, ఇతర అంశాలపై బుధవారం ఆయన తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత భవనాల నిర్మాణ పరిస్థితి, ఆసు పత్రి, హాస్టల్ భవనాల నిర్మాణంపై ఆరా తీశారు. భవ నాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిపై సమీక్షించారు. ఆసు పత్రి మరమ్మతులకు, లోపల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దేవి మాధవి, జీజీహెచ్ సూపరిం టిండెంట్ డా.పద్మజ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ భారతి తదితరులు ఉన్నారు.
పీఎంఏవై గృహాలను ప్రవేశాలకు సిద్ధం చేయాలి
పీఎంఏవై కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా.. 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించా రు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న గృహాల ను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవల్‌లో ఆర్సీ స్థాయి లో ఉన్నవన్నీ పూర్తి కావాలని, ఇకపై ప్రతి వారం సమీ క్షిస్తామని తెలిపారు. కాలనీలో నిర్మాణాలకు అనువుగా ఉన్నవాటిని గుర్తించి, అందుకు ఎంత మేరకు భూమి అవసరం పడుతుందో.. ప్రతిపాదనలు తయారు చేయా లన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు పాల్గొన్నారు.
పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేష న్ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ -పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్ పేరుతో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నెలరోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టరును బుధవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డీజేడీఎం జయచంద్ర, జేఈవీ రాజేష్‌కుమార్ పాల్గొన్నారు.