పది ఫలితాల్లో మొదటి వరుసలో ఉండాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:03 AM
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి వరుసలో నిలవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు.
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి వరుసలో నిలవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖపై సమీక్షా సమావేఽశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను కొలిచే మొదటి ప్రమాణం వారి ర్యాంకేనని అన్నారు.జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలలు ర్యాంకులు సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
నాణ్యతపై దృష్టి పెట్టండి..
మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. మోనూ కచ్చితంగా పాటించాలని చెప్పారు. డీఈవో మాణిక్యం నాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం 87 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో మన జిల్లా 7వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డిసెంబరు 5వ తేదీలోగా సిలబస్ పూర్తి చేసి... 100 రోజుల కార్యాచరణ ప్రకారం ప్రత్యేక తరగుతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన స్కౌట్ మాస్టర్లను కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ రామారావు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లక్ష్యాలను సకాలంలో సాధించాలి
ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సకాలంలోని సాధించాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాత్రి తన చాంబర్‌లో జిల్లాలోని పలు ప్రాజెక్టులను సం బందించి భూసేకరణ, ఎంఎస్‌ఎంఈ పార్కుల, పరిశ్రమల అభివృద్దిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎన్‌హెచ్-130 సిడి రోడ్డు ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువు లోగా జరగాలన్నారు. జాప్యాన్నికి గల కార ణాలు గుర్తించి పరిష్క రించాలన్నారు. రైల్వే మూడు,నాలుగో లైనుల్లో భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, ఆర్‌డీవోలు కీర్తి, రామ్మోహన్, ప్రమీలగాంధీ పాల్గొన్నారు.