విధులకు సకాలంలో హాజరుకావాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:01 AM
మునిసిపల్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని కోరారు. ఫీల్డ్‌కు వెళ్లిన సిబ్బంది సైతం ఆ వివరాలను కార్యాలయంలో పొందుపరచాలని సూచించా రు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు.
రాజాం రూరల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని కోరారు. ఫీల్డ్‌కు వెళ్లిన సిబ్బంది సైతం ఆ వివరాలను కార్యాలయంలో పొందుపరచాలని సూచించా రు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు.
వ్యాపారులకు అండగా ఉంటాం
రాజాం రైతుబజార్‌లో అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి అండగా ఉంటామని మునిపిపల్ కమిషనర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. పాతబస్టాండ్ ఆవరణలోని రైతుబజార్ వెలుపల పదుల సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తుం డడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కనీసస్థాయిలో అమ్మకాలు కూడా జరగడం లేదని ఈనెల 17న పలువురు వ్యాపారులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈనేపధ్యంలో రైతుబజార్ లోపల, వెలుపల కమిషనర్ మంగళవారం పరిశీలించారు. 41 షాపులు ఖాళీగా ఉండడాన్ని కమిషనర్ గుర్తించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడి వెలుపల వ్యాపారాలు చేసుకుంటున్న వారికి లోపల షాపులు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.