జూడో పోటీల్లో మెరిసిన మూర్తి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:27 AM
జాతీయ స్థాయి జూడో క్లస్టర్ పోటీల్లో కానిస్టేబుల్ బీఎస్‌ఎన్ మూర్తి రజత పతకం సాధించారు.
కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ
విజయనగరం క్రైం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి జూడో క్లస్టర్ పోటీల్లో కానిస్టేబుల్ బీఎస్‌ఎన్ మూర్తి రజత పతకం సాధించారు. ఈయన జిల్లా పోలీసు శాఖలో ట్రాఫిక్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జమ్మూ రాష్ట్రం శ్రీనగర్‌లో 10వ ఆలిండియా పోలీసు జూడో క్లస్టర్ పోటీల్లో రాష్ట్ర పోలీసు జట్టు తరుపున 65 కిలోల విభాగంలో పాల్గొని, రజత పతకం సాధించారు. ఈయన సోమవారం ఎస్పీ దామోదర్‌ను స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీ ఈయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఆర్‌ఐ గోపాలనాయుడు, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అఽధికారులు పాల్గొన్నారు.