Share News

వృద్ధుడి హత్య

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:06 AM

మండలంలోని కొండకిందాం గ్రామంలో తండ్రి హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.

వృద్ధుడి హత్య

బొండపల్లి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండకిందాం గ్రామంలో తండ్రి హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెదమజ్జి నాయుడు(72)ను కుమారుడు గణేష్‌కుమార్‌ గునపాంతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 15 రోజుల కిందట తండ్రీ కొడుకు మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో తండ్రి కాలు విరిగిపోయింది. అప్పటి నుంచి గొడవలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో గణేష్‌కుమార్‌ పక్కనే ఉన్న గునపాం తీసుకుని తండ్రిని పొడిచేశాడు. రక్తపు మడుగులో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై అందిన సమాచారంతో ఎస్‌ఐ యు.మహేష్‌ గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Updated Date - Sep 26 , 2025 | 12:06 AM