murder by son కొడుకే కాలయముడై
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:43 AM
murder by son మంచం పట్టిన తండ్రిని కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు మృగంలా ప్రవర్తించాడు. కనీసం కదల్లేని తండ్రి పట్ల ఏమాత్రం దయలేకుండా.. అతన్ని అత్యంత కర్కశంగా అంతమొందించాడు. మద్యంమత్తులో మానవీయతను మరిచాడు. గొంతు కోసి తలను వేరు చేసి ఓ గమేనా (సిమెంట్ గోలం)లో పెట్టి ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. శనివారం సాయంత్రం బాడంగి మండలం గొల్లాది గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మామిడి సత్యం (62) మృతిచెందాడు. ఈ దారుణాన్ని చూసిన వారంతా చలించిపోయారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి ఏర్ప డింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొడుకే కాలయముడై
తండ్రిని అత్యంత కర్కశంగా అంతమొందించిన తనయుడు
తలను వేరుచేసి.. గమేనాలో పెట్టిన వైనం
ఘటనా స్థలంలో భయానక పరిస్థితి
బాడంగి/బొబ్బిలి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మంచం పట్టిన తండ్రిని కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు మృగంలా ప్రవర్తించాడు. కనీసం కదల్లేని తండ్రి పట్ల ఏమాత్రం దయలేకుండా.. అతన్ని అత్యంత కర్కశంగా అంతమొందించాడు. మద్యంమత్తులో మానవీయతను మరిచాడు. గొంతు కోసి తలను వేరు చేసి ఓ గమేనా (సిమెంట్ గోలం)లో పెట్టి ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. శనివారం సాయంత్రం బాడంగి మండలం గొల్లాది గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మామిడి సత్యం (62) మృతిచెందాడు. ఈ దారుణాన్ని చూసిన వారంతా చలించిపోయారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి ఏర్ప డింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గొల్లాది గ్రామానికి చెందిన మామిడి సత్యం కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కదలలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. మాటలు రావు. కాళ్లు, చేతులు కూడా పనిచేయవు. కొడుకు రాము తరచూ మద్యం సేవిస్తూ సైకోగా మారి తండ్రిని, భార్యను, ఇతర కుటుంబీకులను శారీరకంగా హింసిస్తుంటాడని స్థానికులు తెలిపారు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో రాము భార్యను కొడుతుండగా తండ్రి సత్యం ఆమెను బయటకువెళ్లిపొమ్మని సైగ చేశాడు. దీంతో రాము మరింత కోపోద్రిక్తుడై కత్తి తీసుకుని తండ్రి గొంతు కోశాడు. తలను వేరు చేసి ఓ గమేనా (సిమెంట్ గోలం)లో పెట్టి ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. తండ్రిని హత్య చేయడానికి ఎటువంటి ఆస్తి వివాదాలు, ఇతర కారణాలేవీ లేవని ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటన తర్వాత ఇళ్లంతా రక్తపు మడుగులో భయానకంగా తయారైంది. తల లేకుండా సత్యం మృతదేహం మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. గ్రామసర్పంచ్ బేతనపల్లి శంకరరావు ఇచ్చిన సమాచారం మేరకు బొబ్బిలి డీఎస్‌పి భవ్యారెడ్డి, సీఐ కె.నారాయణరావు, ఎస్‌ఐ తారకేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సత్యంకు భార్య ఆదమ్మ, ముగ్గురు కుమారులు తవుడు, గౌరు, రాము ఉన్నారు. మొదటి ఇద్దరు కుమారులు విశాఖపట్నంలో తాపీ మేస్ర్తీలుగా పనిచేస్తున్నారు. నిందితుడైన రాము గొల్లాదిలోనే తల్లిదండ్రులతో ఉంటూ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య గంగమ్మ, ఇద్దరుకుమార్తెలు ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.