Share News

మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:08 AM

కార్మికుల వేతనాలు పెంచాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పాలకొండ నగర పం చాయతీ కమిటీ నాయకులు కోరారు.

మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు
కమిషనర్‌ రత్నంరాజుకు సమ్మె నోటీసు ఇస్తున్న కార్మికులు :

పాలకొండ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): కార్మికుల వేతనాలు పెంచాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పాలకొండ నగర పం చాయతీ కమిటీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారంనగర పంచాయతీ కమిషనర్‌ రత్నరాజుకు సమ్మెనోటీసు ఏపీమునిసిపల్‌ వర్కర్స్‌అండ్‌ ఫెడరేషన్‌ నగర పంచాయతీ కమిటీ గౌరవాధ్యక్షడు దావాల రమణారావు, ఇంజనీరింగ్‌ విభాగం కన్వీనర్‌ వై.హరిబాబు, ప్రతినిధివర్గం వై.సురేష్‌, బి.శివ, పి.అప్పల కొండ, ఎస్‌.అరవింద్‌ అందజేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఈనెల ఆరో తేదీ నుంచి 14 రోజులు అనంతరం ఏ రోజు నుంచైనా సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. జీవో-16, 15లో పేర్కొన్న విధంగా మునిసిపల్‌ ఇంజనీరింగ్‌, పారిశుధ్య కార్మికులకు పీఆర్సీ ప్రకారం జీతాలు, కరువు భత్యం, ఐఆర్‌ చెల్లించాలని కోరారు. ప్రజలకు, పర్యావరణా నికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని నోటీసులో పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:08 AM