సేంద్రీయ ఎరువులతో బహుళ ప్రయోజనాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:20 AM
సేంద్రీయ ఎరువులతో కూడిన వాటిని ఉపయో గిస్తే బహుళ ప్రయోజనం లభిస్తుందని ప్రకృతి వ్యవసాయం డీపీఎం శ్రావణ్‌కుమార్ నాయుడు తెలిపారు.ఖరీఫ్‌లో రసాయనఎరువులు వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.
గరుగుబిల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):సేంద్రీయ ఎరువులతో కూడిన వాటిని ఉపయో గిస్తే బహుళ ప్రయోజనం లభిస్తుందని ప్రకృతి వ్యవసాయం డీపీఎం శ్రావణ్‌కుమార్ నాయుడు తెలిపారు.ఖరీఫ్‌లో రసాయనఎరువులు వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.మంగళవారం తోటపల్లిలోని జట్టు కార్యాలయం ప్రాంగణంలో 15 మండలాలకు చెందిన వీఏఏలు, వీహెచ్‌ఏలు,ఏఈవోలు, వ్యవసాయసిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధికంగా క్రిమి సంహారక మందులు వినియోగించడంతో భూమి సారవంతం తగ్గుతుందన్నారు. రసా యనఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజసిద్ధంగా లభించేవాటిని ఉపయో గించాలన్నారు.ప్రకృతివ్యవసాయ విధానాలపై రైతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.నూతనవిధానంలో పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఏటీఎం, ఎ-గ్రేడ్‌మోడల్,అన్నపూర్ణ పంటలనమూనాతో అధికదిగుబడి సాధించవచ్చని తెలిపారు.
ఈ-పంట నమోదు చేసుకోవాలి
గరుగుబిల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఈ-పంట నమోదు చేసుకోవాలని ఏవో జ్యోత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు.13 రైతుసేవా కేంద్రాల పరిధిలో రైతులు సాగు చేస్తున్న పంటలు వివరాలను వ్యవసాయ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. రైతులు సాగుచేస్తున్న పంటకు సంబంధించిన సమాచారం అందించాలని తెలిపారు. ఈ-పంట నమోదు వల్ల ప్రకృతి వల్ల నష్టం వాటిల్లితే తగిన పరిహారం ప్రభుత్వపరంగా అందుతుందని పేర్కొన్నారు.
వెయ్యి టన్నుల ఎరువులు సిద్ధం
మక్కువరూరల్, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి):రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు పూర్తిస్తాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు ఏవో చింతల భారతి తెలిపారు. ఖరీఫ్‌లో వెయ్యిటన్నుల ఎరువులను అందుబాటులో సిద్ధంగా ఉంచామని చెప్పారు. మంగళవారం మండలంలోని పనసభద్ర పంచాయతీలోని దుగ్గేరు, పనసభద్ర గ్రామా ల్లో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వరినాట్లు వేస్తున్న రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు.