Share News

కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు

ABN , Publish Date - May 03 , 2025 | 12:12 AM

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రోద్భలంతో రామభద్ర పురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో వంద ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేయనున్న ట్టు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వెల్లడించారు.

కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు

బొబ్బిలి రూరల్‌/ రామభద్రపురం, మే 2 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రోద్భలంతో రామభద్ర పురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో వంద ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేయనున్న ట్టు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి కోటలో ఆయన ఏపీ ఐఐసీ జనరల్‌ మేనేజర్‌ మత్స మురళీమోహన్‌తో దీనిపై చర్చించారు. విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సుమారు 275 ఎకరాల్లో ఈ ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - May 03 , 2025 | 12:12 AM