Share News

Moving forward with everyone's cooperation.. అందరి సహకారంతో ముందుకు..

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:52 PM

Moving forward with everyone's cooperation.. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని, ఎలాంటి సమస్యలు వచ్చినా అందరి సహకారంతో పరిష్కరిస్తామని, వెనుకబాటును చక్కదిద్దుతామని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌గా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Moving forward with everyone's cooperation.. అందరి సహకారంతో ముందుకు..
బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

అందరి సహకారంతో ముందుకు..

వెనుకబడిన రంగాలపై ప్రత్యేక దృష్టి

కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని, ఎలాంటి సమస్యలు వచ్చినా అందరి సహకారంతో పరిష్కరిస్తామని, వెనుకబాటును చక్కదిద్దుతామని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌గా శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఏయే రంగాల్లో వెనుకబడి ఉందో ముందు పరిశీలించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెడతామన్నారు. వలసలను నివారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తామన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో సీఎం పలు సూచనలు ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టులు, పరిశ్రమల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయ భవనాల ఏర్పాటు ప్రక్రియను పురోగతి వైపు నడిపిస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులో వస్తే దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. ఎగుమతులకు ఎంతో అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలోని సముద్రతీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను ముందుకు తీసుకువెళ్తామన్నారు. అంతకుముందు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు, జిల్లా అధికారులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 11:52 PM