Share News

Mother's Milk తల్లిపాలే అమృతం

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:46 PM

Mother's Milk is Nectar బిడ్డ భూమి మీద పడగానే బిడ్డకు తల్లి అందించే అమృతం ముర్రుపాలు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే నేటి ఆధునిక సమాజంలో నెలకొన్న అనేక అపోహాల వల్ల ఎంతోమంది బిడ్డలకు పాలివ్వకుండా వారి అనారోగ్యానికి కారణమవుతున్నారు. తల్లులు కూడా పలు వ్యాధులకు గురువుతున్నారు. అందుకే తల్లిపాల ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తుంటారు.

 Mother's Milk తల్లిపాలే అమృతం

  • అమ్మకూ వ్యాధులు దూరం

  • నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

సాలూరు రూరల్‌/జియ్యమ్మవలస, జూలై31(ఆంధ్రజ్యోతి): బిడ్డ భూమి మీద పడగానే బిడ్డకు తల్లి అందించే అమృతం ముర్రుపాలు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అయితే నేటి ఆధునిక సమాజంలో నెలకొన్న అనేక అపోహాల వల్ల ఎంతోమంది బిడ్డలకు పాలివ్వకుండా వారి అనారోగ్యానికి కారణమవుతున్నారు. తల్లులు కూడా పలు వ్యాధులకు గురువుతున్నారు. అందుకే తల్లిపాల ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. బిడ్డకు తొలి పోషణ, రక్షణ ఇచ్చేవి తల్లిపాలే. పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలి. ‘బిడ్డకు తల్లి కూర్చోని పాలు పెట్టాలి. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి. దీనిలో కొలస్ట్రమ్‌ ఉంటుంది. దీని వల్ల బిడ్డకు వ్యాధినిరోధక శక్తి లభిస్తుంది. బిడ్డకు కూర్చోని పాలిచ్చి వెంటనే భుజంపై వేసుకొని వీపు నిమిరాలి. పాలిచ్చిన వెంటనే మంచంపై వేయకూడదు. ఆపరేషన్‌ చేసిన ముర్రు పాలు వస్తాయి. ప్రతి తల్లి బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వాలి.’ అని సాలూరు నియోజకవర్గ వైద్యశాఖ ప్రోగ్రామింగ్‌ అధికారి డి.శివకుమార్‌ తెలిపారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో భద్రగిరి, కురుపాం, కొమరాడ, పార్వతీపురం, పాచిపెంట, భామిని, బలిజిపేట, పాలకొండ, సాలూరు, సీతంపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,436 మెయిన్‌, 639 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 60,166 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో పాలు ఇచ్చే తల్లులు 3,177 మంది, గర్భిణులు 4,305 మంది, 0-6 నెలల వయస్సు ఉన్న పిల్లలు 2,712 మంది, 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 22,007 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లు మధ్యనున్న పిల్లలు 20,331 మంది, కౌమార బాలికలు 7,634 మంది ఉన్నారు. వీరందరికీ ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లి పాలు ప్రాముఖ్యతను వివరిస్తారు.

Updated Date - Jul 31 , 2025 | 11:47 PM